ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదవశాత్తు గోదావరిలో పడి వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 04:12 PM

తూర్పు గోదావరి: పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామానికి చెందిన అంబటి ప్రకాష్ రావు( 51) ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంబటి ప్రకాష్ రావు సోమవారం సాయంత్రం సమయంలో అదుపుతప్పి గోదావరిలో పడి గల్లంతు అయ్యాడు. సోమవారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతని కోసం గాలించిన ఆచూకీ దొరకలేదు.

ఈ విషయాన్ని గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ బండి మహాలక్ష్మీ దృష్టి కి తీసుకుని వెళ్లగా వెంటనే ఆమె ప్రకాశరావు కుమారుడు అంబటి శ్రీను చేత పి. గన్నవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. మంగళవారం ఉదయం మత్స్యకారులతో గాలింపు చేపట్టాగా ప్రకాశరావు మృతి దేహం లభించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వ హాస్పిటల్ కి మృతదేహాన్ని తరలించారు. అంబటి ప్రకాష్ రావు మృతి పట్ల గ్రామ సర్పంచ్ బండి మహాలక్ష్మి, గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa