ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లో కొత్తగా 6,213 కరోనా కేసులు.. జిల్లాల వారీగా కేసుల వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 06:02 PM

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండగా రికవరీలు పెగుతుండటం ఊరకట కలిగిస్తోంది. జిల్లాల్లో రోజువారీ కేసులు కూడా వెయ్యిలోపే నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా 20శాతం కంటే దిగువకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 35,035 టెస్టులు నిర్వహించగా... 6,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జిల్లాలో కూడా రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యికి మించలేదు. అత్యధికంగా కృష్ణాజిల్లాలో 903 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 308, చిత్తూరు జిల్లాలో 228, తూర్పుగోదావరి జిల్లాలో 731, గుంటూరు జిల్లాలో 830, కడప జిల్లాలో 462, కృష్ణా జిల్లాలో 903, కర్నూలు జిల్లాలో 679, నెల్లూరు జిల్లాలో 307, ప్రకాశం జిల్లాలో 324, శ్రీకాకుళం జిల్లాలో 195, విశాఖపట్నం జిల్లాలో 518, విజయనగరం జిల్లాలో 86, పశ్చిమ గోదావరి జిల్లాలో 642 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

గడచిన 24గంటల్లో కరోనాతో ఐదుగురు మరణించారు. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,620గా ఉంది. ప్రభుత్వం తాజాగా నిర్వహించిన 35,035 టెస్టులతో కలిపి ఇప్పటివరకు 3,25,05,747 టెస్టులు నిర్వహించింది. గతంలో రోజుకు 20 నుంచి 30వేల టెస్టులను మాత్రమే నిర్వహించిన ప్రభుత్వం.. థర్డ్ వేవ్ నేపథ్యంలో 40వేల టెస్టులు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa