ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. కడప నుంచి విజయవాడ, చెన్నైలకు ఇండిగో విమాన సర్వీసులను షురూ చేయనుంది. ఈ మేరకు ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఇండిగో ఒప్పందం చేసుకుంది. ఈ మార్గాలను నడిపే విమానయాన సంస్థ ట్రూజెట్ సేవలను నిర్వహించేందుకు తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత అధికారులు ఇండిగోకు అవకాశం ఇచ్చారు.
తాజా ఒప్పందం ప్రకారం వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద ఏపీ ప్రభుత్వం ఇండిగోకు రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 27 నుంచి చెన్నై-కడప, విజయవాడ-కడప మార్గాల్లో ఇండిగో వారానికి నాలుగు విమానాలను నడపనుంది. అలాగే కర్నూలు నుంచి విజయవాడకు మార్చి 27 నుంచి విమాన సర్వీసులు నడపనున్నట్లు ఇండిగో గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa