గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారి పై ఉన్న ఏపీఎస్పీ 6వ పటాలంలో బుధవారం మియవాకి పద్ధతిలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. కార్యక్రమంలో వర్చవల్ విధానం ద్వారా రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సూచరిత హాజరయ్యారు. డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగం రాష్ట్రం లోని అన్ని పోలీస్ బెటాలియన్ లలో మొక్కలు నాటే కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు. మొత్తం ఎనిమిది బెటాలియన్ లలోని 15. 35 ఎకరాల్లో 19, 774 చెట్ల నాటనున్నారు.
అనంతరం డిజిపి సవాంగ్ మాట్లాడుతూ మియవకి పద్దతిలో మొక్కలు నాటే కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. బెటాలియన్ అడిషనల్ డెరైక్టర్ జనరల్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమానికి చేపట్టడం జరిగిందని తక్కువ విస్తీర్ణంలో ఈ ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగిందని చెప్పారు. మియావకి విధానం ద్వారా మూడు సంవత్సరాల పాటు మనం చెట్లను సంరక్షించాలని అనంతరం ఒక్క చక్కటి వృక్ష సంపద గా మారుతుందని అన్నారు. అటవిశాఖ అధికారుల ద్వారా భూసార పరీక్షలు ఆనంతరం ఈ మియవకి పద్దతి ద్వారా చెట్లను నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa