చిత్తూరు: చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి బీసీల అభివృద్ధికి కృషి చేశారని ఎమ్మెల్సీ దొరబాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా టిడిపి కార్యాలయంలో నగర బీసీ సెల్ అధ్యక్షుడు శంకర్ అధ్యక్షతన బీసీ సెల్ కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు కాజురు బాలాజీ, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజు, మాజీ డిప్యూటీ మేయర్ సుబ్ర సుబ్రమణ్యం , పార్టీ నగర ప్రధాన కార్యదర్శి దుర్గా చౌదరి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa