ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి రవాణా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 04:15 PM

విశాఖపట్నం: నాతవరం మీదుగా గంజాయి రవాణా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఐజి కాంతారావు పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాతవరం పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం శాంతి భద్రతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ నుంచి నాతవరం మీదుగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. గంజాయి రవాణా జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మండలంలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిఐజి వెంట నర్శీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa