భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా (BPNL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇటీవలనోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనింగ్ కంట్రోల్ ఇంచార్జ్‌తో సహా మొత్తం 7875 పోస్టులను భర్తీ చేయనుంది BPNL. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రైనింగ్ కంట్రోల్ ఆఫీసర్ - 75
ట్రైనింగ్ ఇంఛార్జ్ - 600
ట్రైనింగ్ కోఆర్డినేటర్ - 1200
ట్రైనింగ్ అసిస్టెంట్ - 6000 పోస్టులు ఉన్నాయి.
ట్రైనింగ్ కంట్రోలింగ్ ఆఫీసర్: నెలకు రూ. 21,700
ట్రైనింగ్ ఇంఛార్జ్: నెలకు రూ. 18,500
ట్రైనింగ్ కోఆర్డినేట్: నెలకు రూ. 15,600
ట్రైనింగ్ అసిస్టెంట్: నెలకు రూ. 12,800
మరిన్ని వివరాలకు https://www.bharatiyapashupalan.com/ లింకుపై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa