గుంటూరు జిల్లాలో రబీ సీజన్‌లో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు అవసరమైనంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆర్బీకేలు, డీసీఎంఎస్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ప్రభుత్వం తరఫున అమ్మకాలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరిస్తున్నారు. అయినా మార్కెట్‌లో యూరియాకు డిమాండ్ ఉందన్న ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు డీలర్లు కొందరు గరిష్ఠ చిల్లర ధర కంటే అధికంగా విక్రయిస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, యూరియా ఆర్బీకేలు, పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లో బస్తా రూ. 266. 50కే లభిస్తుండటంతో రైతులు కాంప్లెక్స్ ఎరువుల బదులు యూరియా ఎక్కువగా వాడుతున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. దీంతో క్షేత్రస్థాయిలో ఆర్బీకేల వారీగా అవసరాల మేరకు సరఫరా చేస్తున్నా కొరత వెంటాడుతోంది.
సరకు లేదని చెప్పి.
జిల్లాకు వచ్చే ఎరువుల్లో 50 శాతం మార్క్ ఫెడ్ కు సరఫరా చేస్తుండగా, మరో 50 శాతం ప్రైవేటు డీలర్లకు సరఫరా చేస్తున్నారు. టోకు వ్యాపారుల నుంచి ప్రైవేటు డీలర్లకు యూరియా సరఫరా చేయడానికి మధ్యవర్తులు ఉంటారు. ప్రైవేటు డీలర్లకు ఆయా కంపెనీలు రవాణా ఛార్జీలు ఇవ్వకపోవడంతో రవాణా, ఎత్తుడు, దించుడు కూలీలు ప్రైవేటు వ్యాపారులపైనే పడుతోంది. దీంతో వారు యూరియాను గరిష్ఠ చిల్లర ధరకు విక్రయిస్తే నష్టం వస్తుందని కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఈక్రమంలో అవసరాలకు సరిపడా అందుబాటులో లేదన్న ప్రచారం జరుగుతోంది. కొంతమంది వ్యాపారులు సరకు అందుబాటులో లేదని, అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa