ఏపీలో పీఆర్సీ ఫైట్ కాక రేపుతోంది. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య జరుగుతున్న వార్‌లో భాగంగా గురువారం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి వెళ్లడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఫిబ్రవరి 3వ తేదిన సెలవులు పెట్టుకున్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని జరగనివ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉద్యోగస్తులసెలవులను రద్దు చేసింది. ఏ జిల్లాలో ఉద్యోగస్తులకు సెలవులు మంజూరు చేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వం కలెక్టర్‌లను ఆదేశించింది. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఏ ఒక్క ఉద్యోగి కూడా సెలవు అనుమతి ఇవ్వొద్దంటూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెలవులు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉత్తర్వుల్లో కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వం ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునే భాగంగానే తమకు సెలవులు ఇవ్వడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి చలో విజయవాడ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రయాణమయ్యారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న వాళ్లను మార్గం మధ్యలోనే బుధవారం సాయంత్రం నుంచే పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa