ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను ప్రాణంగా ప్రేమిస్తున్న భర్త.. ప్రియుడి మోజులో భార్య!

national |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 09:32 AM

ప్రేమించిన వ్యక్తి కోసం కొందరు ఏమైనా చేస్తుంటారు. ఈ విషయంలో మరో ఆలోచన లేకుండా ముందుకు సాగుతుంటారు. తాము ప్రేమించిన వాళ్లు తమకు హాని చేయాలని చూసినా వీరికి మాత్రం వారిపై ఉన్న ప్రేమ ఏ మాత్రం తగ్గదు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రేమ కూడా దాదాపు ఇలాంటిదే. అతడు ప్రేమించింది మరెవరినో కాదు స్వయానా అతడి భార్యనే. అయితే అతడి భార్యకు మాత్రం అతడిపై ఏ మాత్రం ప్రేమ లేదు. అంతేకాదు భర్తను కాకుండా మరో వ్యక్తిని ఇష్టపడింది. వివరాల్లోకి వెళితే.. ఛతర్‌పూర్ జిల్లాలోని లవ్‌కుష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సంతోష్‌కు భార్య సుధ.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇక్కడ నివసించే ప్రమోద్‌తో సంతోష్ భార్య సుధతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం భర్త సంతోష్‌కు తెలిసింది. అయితే భార్య అంటే సంతోష్‌కు ఎంతో ప్రేమ. అందుకే ఈ విషయంలో భార్యకు నచ్చజెప్పేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఇది సరైన పద్ధతి కాదని నలుగురితో చెప్పించాడు. ఇప్పటికైనా మారాలని ఆమెకు సూచించాడు. కానీ సంతోష్ భార్య సుధ మాత్రం తన ప్రియుడి విషయంలో ఏ మాత్రం మనసు మార్చుకోలేదు.


అంతేకాదు ఈ విషయంలో భర్త సంతోష్ అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో అతడు తాగే టీలో విషం ఇచ్చింది. దీంతో సంతోష్ ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రిలో చేరినా సంతోష్‌కు మాత్రం భార్య అంటే ఏ మాత్రం కోపం రాలేదు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. తనకు ఇప్పటికీ తన భార్యే కావాలంటూ చెప్పుకొచ్చాడు. ఆస్పత్రిలోనూ ఆమె ఫోటోనే చూసుకుంటూ ఉండిపోయాడు. అయితే తన భార్యను లోబర్చుకున్న ప్రమోద్ ఆమెను వదలడానికి ఇష్టపడటం లేదని సంతోష్ వాపోయాడు. తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సంతోష్ ఇష్టపడటం లేదు. తన భార్య తనను చూడటానికి వస్తే మరోసారి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే భర్త ఆస్పత్రిలో చేరినా అతడి భార్య సుధ మాత్రం భర్తను చూడటానికి రాకపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa