ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి.అధికారం కైవసం చేసుకునేందుకు పదునైనా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కర్హల్ స్థానం నుంచి తొలి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఆయనపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని పోటీకి దించడం లేదు. ఇది కేవలం మర్యాద పూర్వకమైన నిర్ణయమని కాంగ్రెస్ తెలిపింది. ఇక ఇలాంటి సమయంలో అఖిలేశ్ పార్టీకి టీఎంసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నిల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అఖిలేశ్ యాదవ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు దీదీ ప్రకటించారు. యూపీలో బీజేపీని తరిమి కొట్టేందుకే తమ మద్దతు ఎస్పీకి ఇస్తున్నట్లు తెలిపారు. టీఎంసీ కార్యకర్తలు సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం టీఎంసీ ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేస్తుందని దీదీ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు అన్ని కలిసి బీజేపీని ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పటికే తమ పార్టీతో బీజేపీకి చెందిన ఎనిమిది మంది కీలక నేతలు టచ్‌లో ఉన్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa