ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరు వర్గాల మధ్య ఘర్షణ...

national |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 11:41 AM

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో చిన్న గొడవ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.  బురదలో నుంచి కారు వెళ్లగా... అటుగా వెళ్తున్న వ్యక్తిపై పడటంతో గొడవ ప్రారంభమైంది. మాటా మాటా పెరగడంతో... వారిద్దరి తరఫున మరికొంత మంది ఘర్షణకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాళ్లు, కర్రలతో ఇష్టం వచ్చినట్లు ఓ వర్గంపై మరో వర్గం దాడి దిగారు. వీరిలో మహిళలు, వృద్ధులు సైతం ఉన్నారు. తలలు పగిలి రక్తాలు.. కారుతున్నా ఘర్షణ మాత్రం ఆపలేదు. ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఘటనపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసినట్లు తెలిపిన జోధ్ పూర్ పశ్చిమ DCP వందితా రాణా తెలిపారు. గాయపడినవారికి వైద్యసేవలు పూర్తైన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa