ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవులివే

national |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 11:44 AM

మీకు ఫిబ్రవరిలో ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే అలర్ట్. బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. బ్యాంకులు తెరిచి ఉన్న రోజే మీ ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేసుకోండి. సాధారణంగా బ్యాంకులకు ప్రతీ ఆదివారం సెలవు ఉంటుంది. దీంతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవే. కాబట్టి బ్యాంకులకు ప్రతీ నెలలో ఆరు లేదా ఏడు సెలవులు వస్తాయి. ఫిబ్రవరిలో 28 రోజులు ఉన్నాయి కాబట్టి ఆరు సెలవులు వచ్చాయి. అయితే దేశవ్యాప్తంగా చూస్తే బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు ఉన్నాయి.


ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్​ (సిక్కింలో బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది)


ఫిబ్రవరి 5: సరస్వతి పూజా, శ్రీ పంచమి, వసంత పంచమి (పశ్చిమ్ బెంగాల్​,ఒడిశా, త్రిపురకు వర్తింపు)


ఫిబ్రవరి 6: ఆదివారం సాధారణ సెలవు


ఫిబ్రవరి 12: రెండో శనివారం సాధారణ సెలవు


ఫిబ్రవరి 13: ఆదివారం సాధారణ సెలవు


ఫిబ్రవరి 15: మహమ్మద్ హజ్రత్ అలీ జయంతి, లుయిస్​-నాగాయ్​-ని (ఉత్తర్​ ప్రదేశ్​, మణిపూర్​లోని బ్యాంకులకు సెలవు)


ఫిబ్రవరి 16: గురు రవిదాస్​ జయంతి (చంఢీగడ్​లో బ్యాంకులకు వర్తింపు)


ఫిబ్రవరి 18: దోల్​జాత్రా​ (పశ్చిమ్ బెంగాల్ వ్యాప్తంగా​ బ్యాంకులకు సెలవు)


ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్​ జయంతి (మహారాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)


ఫిబ్రవరి 20: ఆదివారం సాధారణ సెలవు


ఫిబ్రవరి 26: నాలుగో శనివారం సాధారణ సెలవు


ఫిబ్రవరి 27: ఆదివారం సాధారణ సెలవు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa