టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సోమువీర్రాజు మాట్లాడుతూ ఈ ఘటన జరగడం చాలా బాధాకరం అన్నారు. ఆ కుటుంబం సభ్యుల బాధ వర్ణనాతీతం అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు నిందుతుణ్ణికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa