ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిన్నా టవర్ మీద జెండా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 12:44 PM

గుంటూరు జిల్లా, గుంటూరు నగరం నందు ఉన్న జిన్నా టవర్ గురించి ఈ మధ్య కాలంలో ఎన్నో జరిగిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా వైసీపీ ప్రభుత్వం దేనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  జిన్నా టవర్‌ మువ్వన్నెల రంగులతో ముస్తాబైంది. జిన్నా టవర్‌ సెంటర్‌ వద్ద ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్‌ మనోహర్‌ నాయుడు, గుంటూరు నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ మాట్లాడుతూ  రాగద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ చేయకూడదు. రాజకీయ పార్టీలు ఉద్దేశ పూర్వకంగానే  జిన్నా టవర్ విషయంలో వివాదం సృష్టించాయి. గుంటూరులో అన్ని మతాల వారు కలిసి మెలిసి జీవిస్తున్నారు అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa