చిత్తూరు: గత టీడీపీ హయాంలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను అందించడంలో మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్సీ దొరబాబు , పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని , రాష్ట్ర పార్టీ నాయకులు సురేంద్ర కుమార్ , రాష్ట్ర బిసి నాయకులు షణముగం , మాజీ మేయర్ నగర పార్టీ అధ్యక్షురాలు కటారి హేమలత లు పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నగర మైనారిటీ సెల్ కార్యవర్గ సమావేశం అధ్యక్షులు అక్తర్ ప్రధాన కార్యదర్శి నవాజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎఒక్క పథకం కూడా ఇవ్వడం లేదని , మైనారిటీలందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజలను చైన్యవంతులను చేసి చంద్రబాబు తిరిగి మనం ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గచౌదరి, మోహన్ రాజ్, సుబ్రి, రియాజ్, జిలానీ, జాఫర్, గౌస్, మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa