ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 12:34 PM

చిత్తూరు: తిరుపతి కరకంబాడి మార్గంలోని రెడ్డిగుంట వద్ద బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కరకంబాడి రోడ్డులోని డీమార్ట్ లో మేనేజర్‌గా పనిచేస్తున్న లోకేష్ 11 గంటల ప్రాంతంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. రెడ్డి గుంట క్రాస్ వద్ద రోడ్డు దాటేందుకు మరో ద్విచక్రవాహనం వేగంగా వచ్చిన నేపథ్యంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో లోకేష్ రోడ్డు డివైడర్ ను తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన విష్ణు, ప్రవీణ్, రాజశేఖర్ లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa