ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల పోరాటం న్యాయమైనదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 03:43 PM

పిఆర్సిపై ఉద్యోగస్తులు చేస్తున్న పోరాటం న్యాయమైనదేనని సిఐటియు మండల నాయకులు బి రాజేష్ అన్నారు. ఉద్యోగస్తుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉయ్యూరు లో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు. ఉద్యోగ కార్మికుల ను అక్రమంగా అరెస్టులను వ్యతిరేకించాలని అన్నారు. స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడి , ఆశ , మధ్యాహ్నం కార్మికులు స్కీం వర్కర్లకు కనీస వేతనాలు తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ 500000 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్కీం వర్కర్లకు తెలంగాణ రాష్ట్ర తరహాలో ఉద్యోగ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పర్మినెంట్ చేయాలని చెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన ఉద్యోగస్తులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కమిటీ నాయకులు తెల్లకులబాజీ బాబు, ఇస్మాయి, రధాకృష్ణ నాగరాజు ఎం రాజేశ్వరరావు వేణుగోపాలరావు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు చిట్టి ఈశ్వరరావు వేణుగోపాలరావు పి. మహేష్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa