ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమతులు లేని అమ్మకాలకు రూ.2లక్షల జరిమానా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 04:24 PM

అనుమతులు లేకుండా పశువులు, కుక్కల ఫీడ్ అమ్మకాలు సాగిస్తే రెండు లక్షలు జరిమానా విధించడం జరుగుతుందని విశాఖపట్నం జిల్లా వి మాడుగుల ఏరియా పశువైద్య అధికారి వి చిట్టి నాయుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కంపెనీ పశువుల దాన, పౌల్ట్రీ దాన, మినరల్ పిక్చర్లు దుకాణాలలో అమ్మకాలు సాగించాలంటే తప్పనిసరిగా లైసెన్సు మంజూరు ఉండాలన్నారు. లైసెన్స్ లేకుంటే అమ్మకాలు సాగిస్తే వారికి రెండు లక్షల నుండి 5 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. మండలంలో ఇప్పటివరకు మాడుగుల లో మన గ్రోమోర్ సెంటర్ కు, ఎల్ పొన్నవోలు లో రిషి హరితవనం షాపుకు లైసెన్సులు మంజూరు చేయడం జరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa