ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి వివాహాన్ని హింసాత్మకమని అనడం సరికాదు

national |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 10:54 PM

ప్రతి వివాహాన్ని హింసాత్మకమని పేర్కొనడం సరికాదని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. మహిళలు, చిన్నారుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఆమె తెలిపారు. కానీ, ప్రతి పురుషుడ్ని బలాత్కారుడిగా (రేపిస్ట్) నిందించడం సరికాదన్నారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన ఒక కేసుపై ఢిల్లీ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో సీపీఐ సభ్యుడు బినోయ్ విశ్వమ్ ఒక ప్రశ్న లేవనెత్తారు. గృహహింస చట్టంలోని సెక్షన్ 3 కింద గృహహింస నిర్వచనానికి.. అత్యాచారానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ 375ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి స్మృతి ఇరానీ బదులిచ్చారు. ‘‘ఈ దేశంలో ప్రతి వివాహాన్ని హింసాత్మకమని, ప్రతి పురుషుడ్ని బలాత్కారుడిగా పేర్కొనడం ఈ సభలో సూచనీయం కాదు. మహిళలు, చిన్నారుల రక్షణ ఈ దేశంలో అందరికీ ప్రాముఖ్యమే’’ అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa