మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం సంభవించింది. ఎరవాడ ప్రాంతంలోని శాస్త్రినగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. శ్లాబ్ నిర్మాణం కోసం కార్మికులు పనిచేస్తుండగా... ప్రమాదం సంభవించడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. ప్రమాదంలో శిథిలాల కింద.... మరికొందరు చిక్కుకోగా... పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని...... సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గ్యాస్ కట్టర్ల సాయంతో ఇనుప చువ్వలను తొలగించారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు DCP రోహిదాస్ పవార్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa