ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కరోనా అప్డేట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 10:20 AM

ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌తంలో రోజుకు ప‌ది వేల‌కు పైగా న‌మోదైన కేసులు ఇప్పుడు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఈ వారం రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న విడుదలైన కరోనా బులెటిన్ లో 5,983 కరోనా కేసులు నమోదవ్వగా.. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ లో ఏపీలో 4,605 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,578 శాంపిల్స్ ను పరీక్షించగా.. 4,605 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో అనంతపురం, కడప, కర్నూల్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున.. మొత్తం 10 మంది కరోనాతో చనిపోయారు. ఇక గడిచిన 24 గంటల్లో 11,729 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 22,93,171 కరోనా కేసులు నమోదవ్వగా.. 21,85,042 మంది విముక్తుల‌య్యారు. ప్రస్తుతం ఏపీలో 93,488 యాక్టివ్ కేసులున్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa