ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎనిమిది మందిని పెళ్లాడిన కిలేడీ.. చివరకు ఏమయ్యిందంటే..?

national |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 11:37 AM

ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే దారి మధ్యలోనే ఆ మహిళ డబ్బు, నగలతో మాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ కిలేడీ తనలాగే మరో ఏడుగురిని పెళ్లాడి, మోసం చేసిందని తెలుసుకున్నాడు.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్​ లోని సియోని జిల్లాకు చెందిన దశరథ్​ పటేల్​(41) అనే వ్యక్తికి ఇటీవలే అర్చన(40) పరిచయమైంది. బంధువుల అమ్మాయి అని చెప్పి ఊర్మిళా అహిర్వార్​(28) అలియాస్ రేణు రాజ్​పుత్ ​తో అర్చన అతనికి పెళ్లి కుదిర్చింది. సియోని పొరుగు జిల్లా జబల్​పుర్​లో మంగళవారం దశరథ్​-ఊర్మిళల వివాహం జరిగింది. వధువు బంధువుల్లా అర్చన, అమర్ సింగ్(50) హాజరయ్యారు. దశరథ్​ తన దగ్గరున్న డబ్బు, నగలను ఊర్మిళ, అమర్​ దగ్గర ఉంచమని ఇచ్చాడు. భార్యతో కలిసి తన ఇంటికి బయలుదేరాడు.


కాస్త దూరం వెళ్లాక తనకు ఒంట్లో బాగాలేదని, ఒకసారి కిందకు దిగుతానని ఊర్మిళ చెప్పింది. అదే సమయానికి భాగ్​చంద్​ కోరి(22) అనే యువకుడు బైక్​పై వచ్చాడు. కారులోని డబ్బు, నగలు తీసుకున్న ఊర్మిళ​ ఆ బైక్​పై ఎక్కి పారిపోయింది. దశరథ్​ వెంటనే ఓమ్టీ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగించి గురువారం ఊర్మిళ అలియాస్​ రేణు రాజ్​పుత్​, అర్చన, భాగ్​చంద్​, అమర్​ సింగ్​ను అరెస్టు చేశారు. వీళ్లు గతంలో ఇలానే ఏడుగురిని మోసం చేశారని, పెళ్లి చేసుకుని డబ్బు, నగలతో పరారైనట్లు విచారణలో ఊర్మిళ ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. బాధితులంతా రాజస్థాన్​లోని జైపుర్​, కోట, ధోల్​పుర్​, మధ్యప్రదేశ్​లోని దామోహ్​, సాగర్​కు చెందిన వారని వివరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa