పీఆర్సీ తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం పీఆర్సీ సాధన సమితి ఈనెల 6 అర్థరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.సమ్మెకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు సైతం అందజేశారు. మరికొన్ని గంటల్లో ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్లనున్నారు. దీంతో ఉద్యోగులు సమ్మెకు వెళ్లనీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి అశుతోష్ మిశ్రా నివేదికను ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది. ఇక కీలకమైన మరో రెండు హామీలకు ఉద్యోగులు పట్టుబడుతున్నాయి. శనివారం ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మంత్రుల కమిటీ భేటీ అయ్యింది.
ఉద్యోగ సంఘావల డిమాండ్లను సీఎం వైఎస్ జగన్‌తో చర్చించింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పీఆర్సీ సాధన సమితి నాయకులతో జరిగిన చర్చల సారాంశాన్ని మంత్రుల కమిటీ సీఎం జగన్‌ను వివరిస్తోంది. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయిన వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మలతో పాటుగా ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం మధ్యాహ్నాం మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో భేటీ కానుంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ ముందు మంత్రుల కమిటీ సభ్యుడైన మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు మేలు చేయాలనే యోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నిస్తుందని.. శుక్రవారం సాయంత్రం నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉద్యోగులతో చర్చలు సానుకూలంగా జరిగాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు నష్టం చేసేలా ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని హెఆర్‌ఏతోపాటు అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. శనివారం జరిగే చర్చలు ఫలిస్తాయని తాను ఆశిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa