భారతదేశపు అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అధినేత ముఖేష్ అంబానీ రూ. 13.14 కోట్లతో అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కల్లినన్‌ను కొనుగోలు చేశారు. పెట్రోల్ వేరియంట్ రోల్స్ రాయిస్ కల్లినన్ మోడల్‌ను జనవరి 31న దక్షిణ ముంబైలోని టార్డియో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు.2018 లో తొలిసారిగా లాంచ్ అయినప్పుడు కారు బేస్ ధర రూ. 6.95 కోట్లు. ఈ కారు 2.5 టన్నులకు పైగా బరువున్న 564 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేసే 12 సిలిండర్లను కలిగి ఉంటుంది. ఇది ‘టుస్కాన్ సన్’ కలర్‌లో ఉంది.
కారుకు VIP నంబర్ కోసం 12 లక్షల రూపాయలను RIL చెల్లించింది. కారు నెంబర్ “0001”తో ముగుస్తుందని అధికారులు తెలిపారు. జనవరి 30, 2037 వరకు రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అయ్యే విధంగా కారుకు RIL వన్-టైమ్ ట్యాక్స్ రూ. 20 లక్షలు చెల్లించింది. రోడ్డు భద్రతా పన్ను కింద మరో రూ. 40,000 చెల్లించారు. ఈ కారు కొనుగోలు దేశంలోని అత్యంత ఖరీదైన వాటిలో ఒకటిగా భావిస్తున్నట్లు RTO అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa