ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈనెల పిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ధర్నాలో భాగంగా కృష్ణాజిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్ల సాధన కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో నిరుద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ రోజు అమరావతి బాలోత్సవం భవనంలో "ఛలో కలెక్టరేట్ వాల్ పోస్టర్" రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి జిల్లా నాయకులు డివైఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎన్. నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు యమ్. సోమేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి. పృథ్వి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa