పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీలో అంతర్యుద్ధం, కుమ్ములాటలు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలపై పోరాడాల్సింది పోయి, సొంత పార్టీలోనే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠపై రాహుల్ గాంధీ తెరదించనున్నారు. ఆదివారం లూథియానాలో జరిగే ర్యాలీలో పార్టీ సీఎం అభ్యర్థిని ఆయన ప్రకటించనున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆమ్‌ఆద్మీ పార్టీ భగవత్ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఒత్తిడిలో పడింది. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి
కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయాలను తీసుకుంది. ఆటోమేటెడ్ కాల్ సిస్టమ్ ద్వారా ప్రజల నుంచి సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపై ప్రజలకు ఒపినియన్ పోల్ నిర్వహించింది. దాని ఫలితాల ఆధారంగా సీఎం అభ్యర్థిని రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానంటూనే సిద్ధూ కీలక ట్వీట్ చేశాడు. నిర్ణయం లేకుండా గొప్పగా ఏమీ సాధించలేమని, దీనిపై క్లారిటీ ఇవ్వడానికి వచ్చిన తమ లీడింగ్ లైట్ రాహుల్‌కు హృదయపూర్వక స్వాగతం అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైరం ఉన్నా సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ ఒకే కారులో ప్రయాణిస్తూ మీడియా కంటపడ్డారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 14న 117 నియోజకవర్గాలకు ఒకే దశలో నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa