మేకప్ అనేది చాలా మందికి నార్మల్ అయిపోయింది. ఇది మన ఫేషియల్ ఫీచర్స్‌ని ఎలివేట్ చేస్తుంది. అయితే, మేకప్ వేసుకునేటప్పుడు సరైన విధంగా వేసుకోవాలి. లేదంటే మేకప్ లుక్ మొత్తం సరిగా ఉండదు. ఉదాహారణకి ఫౌండేషన్ వేశాక చాలా మంది రంగు డల్‌గా లేదా ఫ్లేకీగా కనిపిస్తుంది. దీనికి కారణం ఫౌండేషన్ మాత్రమే కాదు. మనం చేసే తప్పులు కూడా వీటి గురించే ఇమేజ్ స్టైలిస్ట్, ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ కోచ్ టీనా వాలియా మేకప్ చేసేటప్పుడు చేయకూడని తప్పులేంటో వివరించారు. అవేంటంటే
సరికాని ఫౌండేషన్‌ని సెలక్ట్ చేసుకోవడం
టీనా వాలియా ప్రకారం, ఫౌండేషన్ వేశాక ముఖం కాంతివిహీనంగా మారడానికి కారణం సరికాని అండర్ టోన్‌ని ఎంచుకోవడం. మనం మన స్కిన్ కలర్‌కి సరైన విధంగా సూట్ అయ్యే ఫౌండేషన్ ఎంచుకోవాలి. లేదంటే అది సరిగ్గా కనిపించకుండా చేస్తుంది. ముఖం పాలిపోయినట్లుగా లేదా మరీ ఫ్లేకీగా, ఎక్కువ రంగుతో కనిపిస్తుంది. కాబట్టి, ముందుగా మీరు ఫౌండేషన్ కొనేటప్పుడు మీకు సూట్ అయ్యే ఫౌండేషన్ సెలక్ట్ చేసుకోవడం మంచిది.
లైట్ షేడ్‌ని ఎంచుకోవడం
ఇది కూడా తప్పే. మన స్కిన్ టోన్ కంటే 2, 3 షేడ్స్ లైట్ ఫౌండేషన్‌ని సెలక్ట్ చేసుకుంటే కొద్దిసేపటి వరకూ అందంగా కనిపిస్తుంది. కానీ, కొన్ని గంటల తర్వాత చర్మ రంగు తగ్గుతుంది. కాసేపటికి డార్క్ షేడ్‌లోకి చేరుతుంది. కాబట్టి, మరీ లైట్ షేడ్ కాకుండా, డార్క్ షేడ్ కాకుండా మీ స్కిన్ టోన్‌కి సరిపోయే షేడ్ సెలక్ట్ చేసుకోవాలి.
ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్ వాడడం
ఇక కొంతమంది ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్‌పై వాటర్ బేస్డ్ ఫౌండేషన్ రాస్తారు. దీని వల్ల కూడా మేకప్ సరిగా సెట్ కాదు. ఫౌండేషన్ విడిపోయి అతుకులుగా కనిపిస్తుంది. రంగు కూడా సరిగా కనిపించదు. స్కిన్ కేర్, ఫౌండేషన్ రెండు కూడా సేమ్ బేస్డ్‌వి తీసుకోండి.
ఆక్సిడేషన్ కారణంగా కూడా
కొన్ని ఫౌండేషన్స్ స్కిన్ ఆయిల్స్‌తో కలిసి టైమ్ గడిచేకొద్దీ ఆక్సిడేషన్ చెందుతాయి. దీని వల్ల కూడా ముదురు, ఆరెంజ్ రంగులో కనిపిస్తుంది. మీది ఆయిల్ బేస్డ్ స్కిన్ అయితే, ఈ సమస్య ఉంటుంది. కాబట్టి, మ్యాట్ లేని లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ ఎంచుకోండి. పూర్తిగా ప్రైమ్ చేయండి.
ఫౌండేషన్ వేసుకునేటప్పుడు చేయకూడని మిస్టేక్స్
మొత్తంగా ఎక్స్‌పర్ట్ ప్రకారం
ఇప్పుడు చెప్పిన తప్పుల కారణంగానే మేకప్ లుక్ సరిగా ఉండదు. వాటిని మీరు రిపీట్ చేయకుండా మీ స్కిన్ టెక్చర్‌కి సరిపోయే ఫౌండేషన్ ఎంచుకోవడం మంచిది. దీని వల్ల మేకప్ ఎప్పుడు నేచురల్‌గా గ్లోయింగ్‌గా కనిపిస్తుంది. కాబట్టి, ఈ విషయాన్ని మరువొద్దు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa