అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఉరవకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. బుదగవి వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. బళ్లారిలో పెళ్లికి వెళ్లిన ఓ బృందం కారులో అనంతపురానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతులు ఉరవకొండ మండలంలో నిమ్మగల్లు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో సంఘటన స్థలం శోకసంద్రంలా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa