అగ్రి ఇన్‌ఫ్రా పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. వీటికి సంబంధించిన నిధుల సేకరణ, టై అప్‌లపై సమీక్షించారు సీఎం. దీనిపై దాదాపు రూ.16,320.83 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి సాధించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా వాటిని రైతులకు, అనుబంధ రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa