చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకోచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని సీఎం చేద్దాం అని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని ఆ పార్టీ శ్రేణులకు మరియు నాయకులకు పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ , కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తొలుత మాజీ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు సి ఎస్ మనోహర్ నాయుడు, సురేంద్ర కుమార్ , షణ్ముగం , కటారి హేమలత , కోదండయాదవ్, గొల్ల హేమాద్రి నాయుడు, కాజురు రాజేష్ , జీడీ నెల్లూరు నియోజకవర్గ కో -ఆర్డినేటర్ చిట్టిబాబు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa