ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫ్గాన్ లో రాకెట్లతో ఉగ్రవాదుల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2017, 02:29 PM

ఆఫ్గానిస్థాన్‌ కాబూల్‌లోని ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు స‌మీపంలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. కాసేప‌ట్లో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటీస్ ఆ విమానాశ్ర‌యానికి వ‌స్తార‌న‌గా దాడి చేశారు. ఆఫ్గాన్‌ హోంశాఖ అధికార ప్రతినిధి నజీబ్‌ దానిశ్ ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ... ఉగ్ర‌వాదులు రాకెట్ల‌తో దాడికి తెగ‌బ‌డ్డార‌ని, అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.ఈ విమానాశ్ర‌యానికి స‌మీపంలో 20 నుంచి 30 రాకెట్లు ప‌డ్డాయ‌ని అక్క‌డి అధికారులు చెప్పారు. వెంట‌నే విమానాశ్రయాన్ని ఖాళీ చేయించామ‌ని తెలిపారు. పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశామ‌ని అన్నారు. ఏ ఉగ్ర‌వాద సంస్థ ఈ దాడికి పాల్పడిందో తెలియాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa