చార్జీలను శాసించే స్థాయిక టెలికమ్ కంపెనీలు వచ్చేశాయి. జియో రంగ ప్రవేశం, 4జీ టెక్నాలజీ విప్లవంతో చిన్న చిన్న కంపెనీలన్నీ కనుమరుగైపోయాయి. టెక్నాలజీ, నెట్వర్క్ సామర్థ్యం, స్పెక్ట్రమ్ కొనుగోళ్లకు రూ. లక్షల కోట్ల పెట్టుబడులు చిన్న కంపెనీలకు సాధ్యమయ్యే పని కాదు. అందుకే, జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి బడా సంస్థలే బరిలో మిగిలాయి. మరొక పక్క, ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్ జీవన్మరణ సమస్య ఎదుర్కొంటోంది. వొడాఫోన్ కూడా వెళ్లిపోయేదే కానీ, కేంద్ర సర్కార్ విధానపరమైన నిర్ణయాలతో ప్రాణం పోసింది. ఈ మూడు ప్రైవేట్ సంస్థలే మిగలడంతో ధరలను విడతల వారీగా పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు గణనీయంగా పెంచేశాయి. దీంతో అలిమిటెడ్ కాల్స్, డేటా ప్యాక్ కోసం నెలవారీగా రూ. 250 ఖర్చు చేయవలసి వస్తోంది. ఎయిర్ ల్ అయితే రూ. 300 వరకు వసూలు చేస్తోంది. అయినా చాలడం లేదన్న వాద నను ఎయిర్టెల్ తరచు వినిపిస్తోంది. తాము భారీగా పెట్టుబడులు పెట్టి, మనుగడ సాగించాలంటే ఒక్కో వినియోగదారు నుంచి సగటున నెలవారీ ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 300 వరకు రావాలన్నది ఎయిర్టెల్ చెప్పే నిర్వచనం. డిసెంబర్ త్రైమాసికం చివరికి ఎయిర్‌టెల్ ఏఆర్పీయూ రూ. 163గా ఉంది. దీనిని 2022 ముగిసేలోగా రూ. 200కు చేరుస్తామని తాజాగా ఫలితాల సందర్భంగా ప్రకటించింది. అంటే కనీసం 20 శాతం మేర ఈ ఏడాది బాదుడు ఉంటుందని తెలుస్తోంది. మరొక విడత రేట్ల పెంపును అంచనా
వేస్తున్నట్లు ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. కొ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa