భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కలిశారు. ముంబై వచ్చిన రామ్ నాథ్ రాజ్ భవన్ లో శుక్రవారం సచిన్ తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఇది మర్యాద పూర్వక భేటీయేనని తెలుస్తోంది. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది. మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడం గమనార్హం. మరోవైపు ‘‘మీకు వంద కోట్ల మందికిపైగా మద్దతు బలం ఉంది. మంచిగా ఆడి, మెరుగైన ఫలితాలు సాధించాలి’’అంటూ భారత జట్టుకు సచిన్ పిలుపునివ్వడం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa