ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కొత్త జిల్లాల స్వరూపమిదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 02:10 PM

ఏపీలో జిల్లాల పునర్విభజన ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలుగా మారనున్నాయి. అతిపెద్ద జిల్లాగా ప్రకాశం, అతి చిన్న జిల్లాగా విశాఖ కానున్నాయి. రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. కొత్త జిల్లాలు ఉగాది నుంచే అమల్లోకి వస్తాయని సీఎం జగన్ అధికారులకు సంకేతాలిచ్చారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాల స్వరూపం, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఇలా ఉండనున్నాయి.

1.శ్రీకాకుళం జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం, నరసన్నపేట.

రెవెన్యూ డివిజన్లు.. టెక్కలి, శ్రీకాకుళం.

మండలాలు 30.

2.విజయనగరం జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. రాజాం,బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతి నగరం.

రెవెన్యూ డివిజన్లు.. విజయనగరం, బొబ్బిలి కొత్త

మండలాలు 26.

3.విశాఖపట్నం జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక.
రెవెన్యూ డివిజన్లు.. భీమిలి (కొత్త), విశాఖపట్నం.

మండలాలు 10.

4.అనకాపల్లి జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి, చోడవరం.

రెవెన్యూ డివిజన్లు.. అనకాపల్లి, నర్సీపట్నం

మండలాలు 25.

5.కాకినాడ జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు..తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం.

రెవెన్యూ డివిజన్లు..పెద్దాపురం, కాకినాడ.

మండలాలు 19

6.కోనసీమ జిల్లా జిల్లా కేంద్రం అమలాపురం

అసెంబ్లీ నియోజకవర్గాలు..రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు,గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం.

రెవెన్యూ డివిజన్లు.. అమలాపురం, రామచంద్రాపురం.

మండలాలు..24

7.తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం.

అసెంబ్లీ నియోజకవర్గాలు..అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం.

రెవెన్యూ డివిజన్లు.. రాజమహేంద్రవరం, కొవ్వూరు.

మండలాలు 20.

8.పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం.

అసెంబ్లీ నియోజకవర్గాలు..అచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం.

రెవెన్యూ డివిజన్లు..నర్సాపురం, భీమవరం కొత్త

మండలాలు 19

9.ఏలూరు జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు..ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి.

రెవెన్యూ డివిజన్లు..ఏలూరు, నూజివీడు, జంగారెడ్డి గూడెం.

మండలాలు 27.

10.మచిలీపట్నం జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు.

రెవెన్యూ డివిజన్లు..గుడివాడ, మచిలీపట్నం.

మండలాలు.. 25

11.ఎన్టీఆర్ కృష్ణాజిల్లా.. జిల్లాకేంద్రం విజయవాడ.

అసెంబ్లీ నియోజకవర్గాలు.. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం.

రెవెన్యూ డివిజన్లు..నందిగామ, తిరువూరు కొత్త, విజయవాడ.

మండలాలు 20.

12.గుంటూరు జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు.

రెవెన్యూ డివిజన్లు.. గుంటూరు, తెనాలి.

మండలాలు 18.

13.పల్నాడు జిల్లా జిల్లా కేంద్రం నరసరావుపేట.

అసెంబ్లీ నియోజకవర్గాలు.. పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి.

రెవెన్యూ డివిజన్లు.. గురజాల, నరసరావుపేట.

మండలాలు 28.

14.బాపట్ల జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల.
రెవెన్యూ డివిజన్లు..బాపట్ల, చీరాల.

మండలాలు..25.

15.ప్రకాశం జిల్లా జిల్లా కేంద్రం ఒంగోలు.

అసెంబ్లీ నియోజకవర్గాలు.. యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం.

రెవెన్యూ డివిజన్లు.. మార్కాపురం, ఒంగోలు, పొదిలి.

మండలాలు..38

16.నంద్యాల జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానిపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం.
రెవెన్యూ డివిజన్లు.. నంద్యాల, డోన్, ఆత్మకూరు.

మండలాలు..27

17.కర్నూలు జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ.

రెవెన్యూ డివిజన్లు.. కర్నూలు, ఆదోని.

మండలాలు 28

18.అనంతపురం జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి.

రెవెన్యూ డివిజన్లు.. కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్.

మండలాలు 34.

19.శ్రీసత్యసాయి జిల్లా జిల్లా కేంద్రం పుట్టపర్తి

అసెంబ్లీ నియోజకవర్గాలు.. మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం.
రెవెన్యూ డివిజన్లు.. ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి.

మండలాలు 29

20.వైఎస్సార్ కడప జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు.

రెవెన్యూ డివిజన్లు.. కడప, జమ్మలమడుగు, బద్వేల్.

మండలాలు 34.

21.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు.

రెవెన్యూ డివిజన్లు.. కావలి, నెల్లూరు, ఆత్మకూరు.

మండలాలు 35.

22.బాలాజీ జిల్లా జిల్లా కేంద్రం తిరుపతి


అసెంబ్లీ నియోజకవర్గాలు.. సూళ్లూరు పేట, గూడురు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు.

రెవెన్యూ డివిజన్లు.. గూడురు, తిరుపతి, నాయుడుపేట.

మండలాలు 35

23.అన్నమయ్య జిల్లా జిల్లా కేంద్రం రాయచోటి.

అసెంబ్లీ నియోజకవర్గాలు.. రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు.
రెవెన్యూ డివిజన్లు.. మదనపల్లె, రాజంపేట, రాయచోటి.

మండలాలు 32

24.చిత్తూరు జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు.. నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు.

రెవెన్యూ డివిజన్లు.. చిత్తూరు, పలమనేరు.

మండలాలు 33.

25.మన్యం జిల్లా జిల్లా కేంద్రం పార్వతీపురం.

అసెంబ్లీ నియోజకవర్గాలు.. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం.

రెవెన్యూ డివిజన్లు.. పాలకొండ, పార్వతీపురం.

మండలాలు..16

26.అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా కేంద్రం పాడేరు.

అసెంబ్లీ నియోజకవర్గాలు.. పాడేరు, అరకు, రంపచోడవరం.

రెవెన్యూ డివిజన్లు.. పాడేరు, రంపచోడవరం.

మండలాలు 22






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa