యడ్లపాడు మండలంలో శుక్రవారం ఉదయం సుమారు 9: 30 గంటల సమయంలో జాతీయ రహదారి తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ ఢీకొట్టడంతో ఒంగోలు నుండి విజయవాడ వెళ్తున్న కారు ఒక్కసారిగా కాలువలోకి దూసుకుపోయింది ఈ ఘటనలో కారు లోని ఇరువురు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి అంబులెన్స్ కి ఫోన్ చేసి కారులోని వ్యక్తులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసు వారికి సమాచారం అందించారు. పోలీస్ వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa