విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయంగా సంవత్సర కాలంగా పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఉక్కుసంకల్పాన్ని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా కూర్మన్నపాలెం శిబిరం వద్ద 365 జెండాలతో చేస్తోన్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నాను. సొంత గనులు లేకపోయినా,ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో రూ.700 కోట్ల లాభాలను ఆర్జించిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తుంట, .తమ స్వార్థం కోసం ప్రభుత్వ పెద్దలు సహకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాను. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు. ఆ హక్కును కాపాడుకునేందుకు ఎల్లవేళలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం అని పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa