ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 08:57 PM

శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలిపింది. శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్టు చెప్పారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 16న ఉదయాస్తమాన సేవా టికెట్లను విడుదల చేస్తామని చెప్పారు. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన వారికి ఈ టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా విరాళమిచ్చిన భక్తులకు ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేస్తామని... ఈ టికెట్ల బుకింగ్ కు ప్రత్యేక పోర్టల్ జారీ చేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa