ముంబైలో మరో మారణహోమానికి దావూద్ ఇబ్రహీం ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం ఈ మేరకు పథకం రచించాడని, ఇప్పటికే దావూద్ గ్యాంగ్ కు, అనీస్ కు పలుమార్లు ఫోన్ సంబాషణలు కూడా జరిగాయని గుర్తించారు పోలీసులు. దావూద్, అనీస్ మధ్య జరిగిన ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడం ద్వారా ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. దావూద్ గ్యాంగ్ తో అనుమానమున్న ఎనమిది మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల అరెస్టయిన దావూద్ సోదరుడి నుంచి ఈ విషయంపై మరిన్ని వివరాలు సేకరించే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa