విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) తాడేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో తాడేపల్లి తాహశీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న విఆర్ఎ ల రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 19 వ రోజుకు చేరుకున్నాయి. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో విఆర్ఎ లు బిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో సాయిబాబా గుడి వద్ద నుంచి నేతాజీ సెంటర్ వరకు ర్యాలీగా బిక్షాటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రాతూరు ప్రభాకరరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు, నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, కొట్టె కరుణాకరరావు, దొంతిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, విఆర్ఎ లు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa