కేంద్ర ప్రభుత్వం బంగారం వ్యాపారులకు, పసిడి కొనుగోలుదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 50 వేల పైబడిన బంగారు ఆభరణాల కొనుగోళ్లకు పాన్ నంబర్ తప్పనిసరి అనే నిబంధనను ప్రభుత్వం ఎత్తేసింది. ఈ మేరకు మనీలాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్, 2002లోని ఆభరణాల కొనుగోలుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. శుక్రవారం సమావేశమైన 22వ జీఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కఠినమైన నో యువర్ కస్టమర్ నిబంధనలు బంగారం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నగల వ్యాపారులు వాపోతున్నారు.
రూ. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ గల ఆభరణాల వ్యాపారులను మనీలాండరింగ్ నిరోధక చట్టం నుంచి కేంద్రం మినహాయించింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం రూ. 2 లక్షల లోపు ఆధార్, పాన్ వివరాలు ఇవ్వకుండానే నగలు కొనుగోలు చేసే వీలుంది. కానీ మనీలాండరింగ్ చట్టం మాత్రం రూ. 50 వేలు దాటిన నగల కొనుగోలుకు పాన్, ఆధార్ లేదా ఇతర గుర్తింపు వివరాలను అందజేయడాన్ని తప్పనిసరి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa