సింగపూర్ సంగీత అకాడమీతో పద్మావతి మహిళా యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్లైన్లో ఇందుకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించారు. సంగీత శిక్షణలో డిప్లొమా కోర్సును నిర్వహించేందుకు ఇరు సంస్థలు నిర్ణయించాయి. సంగీత రంగంలో ఉమ్మడి కార్యకలాపాలకు ఈ ఎంవోయూ ఉపయోగపడుతుందని వర్సిటీ వీసీ జమున పేర్కొన్నారు. సింగపూర్లో భారతీయ సంగీతాన్ని వ్యాప్తి చేయడానికి ఈ ఒప్పందం తోడ్పడాలని రిజిస్ట్రార్ మమత ఆకాంక్షించారు. వర్సిటీ అంతర్జాతీయ వ్యవహారాల డీన్ విజయలక్ష్మి, సంగీత విభాగ ఆచార్యులు ద్వారం లక్ష్మి, సాంస్కృతిక కళాసారథి సంస్థ ఉపాధ్యక్షుడు రత్నకుమార్, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు జ్యోతీశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa