ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 09:58 AM

అనంతపురం: రాయదుర్గం పట్టణంలోని కనేకల్ రోడ్డులో ఈశ్వరీ విశ్వ విద్యాలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం తిమూర్త శివ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్ర రెడ్డి, ఎస్ఐ బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారు మాట్లాడారు. వివిధ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన శివలింగ ప్రతిరూపాలను దర్శించుకున్నారు. మార్చి 3 వరకు ప్రతీరోజూ దర్శనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ వేడుకల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa