ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిలో కొన్ని బెలారస్ నుంచి జరుగుతున్నట్లు జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్‌లో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యన్ దళాలు బాంబులు కురిపించాయని, శనివారం-ఆదివారం మధ్య రాత్రి అత్యంత కిరాతకంగా వ్యవహరించాయని జెలెన్‌స్కీ తెలిపారు. మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేని, ప్రజలు నివసించే చోట దాడులు చేశారని చెప్పారు. అంబులెన్సులతో సహా ప్రతిదానిపైనా దురాక్రమణదారులు దాడి చేస్తున్నారని జెలెన్‌స్కీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa