తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టనుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా నడకదారి భక్తులకు 2 గంటల సమయం పట్టనుంది.
తిరుమలేశుడికి హుండీ ద్వారా రూ.2.59 కోట్ల ఆదాయం లభించింది. శనివారం వచ్చిన కానుకలను ఆదివారం లెక్కించగా ఈ మేరకు ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. కాగా పలువురు దాతలు నిత్యాన్న ప్రసాదానికి రూ. 30.37 లక్షలు, గోసంరక్షణకు లక్ష రూపాయలు, ప్రాణ దానానికి లక్ష రూపాయలు చొప్పున అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa