గుంటూరు: స్థలానికి సంబంధించిన వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కారంపూడి రోడ్డు లోని ఓ హోటల్ వద్ద మంగళవారం రాత్రి మేనమామ ఎర్రవలి, మేనల్లుడు అబ్దుల్లా మధ్య పెద్దల సమక్షంలో పంచాయతి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి. ఇరు వర్గాలకు చెందినవారు ఘర్షణ పడ్డారు. ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ఎర్రవలి, అహ్మద్, కరీముల్లా కు గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏ ఎస్ ఐ స్టాలిన్ బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఘర్షణలో అబ్దుల్లాకు కూడా గాయాలైనట్లు అతని వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa