ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పందన అర్జీలపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 08:40 AM

స్పందన అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని జేసీ జి. రాజకుమారి అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో మంగళవారం గుంటూరు డివిజన్‌స్థాయి స్పందన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలకు సక్రమైన పరిష్కారం చూపి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన తరువాతే ఆన్‌లైన్లో క్లోజ్‌ చేయాలని తెలిపారు. పరిష్కరించడానికి వీలు కాని అర్జీలను పూర్తి వివరణతో నివేదిక తయారు చేసి అర్జీదారుని సంతకంతో ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాస్కరరెడ్డి, డివిజన్‌ పరిధిలోని మున్సిపల్‌ కమీషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa