ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింఛను డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన కుమారుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 09:47 AM

నిత్యం అల్లరి చిల్లరిగా తిరుగుతూ మద్యానికి బానిసైన కుమారుడు పింఛన్ డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా తల్లినే బండరాయితో కొట్టి చంపిన ఉదంతం నరసింహపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.


ఈ ఘటనపై స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు నరసింహపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు చెంచు గాల ఓబులమ్మ (75 )సంవత్సరాల వృద్ధురాల చిన్న కుమారుడు నారాయణ తాగుడుకు బానిసై పింఛన్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తలపై బండరాయితో మోదడంతో తీవ్రంగా గాయపడిందని వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆర్డిటి ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మరణించినట్లు తెలిపారు.


మృతురాలి మూడవ కుమారుడైన రామ్మూర్తి ఫిర్యాదు మేరకు ధర్మవరం రూరల్ సిఐ మన్సూర్, ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa