ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరసనకు దిగితే హౌస్ అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 12:58 PM

జె బ్రాండ్, కల్తీ సారా అమ్మకాలపై నిరసనను అడ్డుకునేందుకు విజయవాడలోని కరెన్సీనగర్ లో అర్థరాత్రి నుంచి వైసీపీ ప్రభుత్వం అచ్చెన్ నాయుడు ను పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించి, ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేయించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పోలీసులతో మీ మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను అణచివేయాలని చూడడం మీ అవివేకం జగన్ రెడ్డి !! కారణాలు చెప్పకుండా పోలీసులు ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే. పోలీసులు జగన్ రెడ్డికి తొత్తులుగా మారి అర్ధరాత్రి నుంచి ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి హౌస్ అరెస్టు చేశారు.  ప్రతిపక్షం ప్రజలలోకి వెళితే జగన్ రెడ్డికి ఉలుకెందుకు? అని అచ్చెన్ నాయుడు ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa