ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంట్ కోతలతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 01:26 PM

కృష్ణా జిల్లా: కోడూరు మండల పరిధిలోని విశ్వనాధపల్లి, పిట్టల్లంక, సాలెంపాలెం తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి దాదాపు ఒంటి గంటల వరకు విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడంతో విశ్వనాధపల్లి పవర్ స్టేషన్ చుట్టుప్రక్కల గ్రామస్తులు పవర్ స్టేషన్ వద్దకు వచ్చి మంగళవారం అర్ధరాత్రి ఆందోళన చేయగా విద్యుత్ శాఖ అధికారులు అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా వదిలారు.


ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సప్లై నిలిపివేయడం ఏమిటని గ్రామస్తులు విద్యుత్ అధికారులను, సిబ్బందిని ప్రశ్నిస్తే వారు చెప్పిన సమాధానం ఈఎల్ఆర్ నిలుపుదల చేశారని, అలా అయితే కోడూరు మండలం మొత్తం విద్యుత్ సప్లై నిలిపివేయాలి కదా అంటూ గ్రామస్తులు విద్యుత్ సిబ్బందిపై మండిపడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా ఇలా పవర్ సప్లై నిలిపివేయడంతో ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్న మంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విద్యుత్ సమస్యతో మంగళవారం రాత్రి మందపాకల విద్యుత్ పవర్ స్టేషన్ చుట్టుప్రక్కల గ్రామస్తులు కూడా అవస్థలు పడ్డామని చెబుతున్నారు.


పవర్ సప్లై లేకపోతే రాత్రివేళ చిన్న పిల్లలతో, వృద్ధులతో అనేక అవస్థలు పడుతున్నామని ఇలాంటివి పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa